అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు తనిఖీ
అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు తనిఖీ
మఠంపల్లి , మన సాక్షి:
సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామం వద్ద కృష్ణా నది బ్రిడ్జి పై గల అంతరాష్ట్ర చెక్ పోస్టును జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పరిశీలించి తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా,ఇతర రాష్ట్రాల నుండి ధాన్యాన్ని మన ప్రాంతంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పకడ్బందీగా వాహనాలు తనిఖీ నిర్వహించి అక్రమ రవాణాన్నీ అడ్డుకోవాలని సూచించారు.
అనంతరం ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత మట్టపల్లి గ్రామం నందు మహా పుణ్యక్షేత్రం అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని మట్టపల్లి దేవస్థానం ప్రాంగణంలో పోలీసు రక్షణ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
బందోబస్తు పర్యవేక్షణకు సంబంధించి గురువారం తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు విధులు బ్రీఫింగ్ కార్యక్రమానికి ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు బందోబస్తు విధులకు వచ్చిన సిబ్బందికి విధుల నిర్వహణపై సూచనలను సలహాలను అందించారు. భక్తులకు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవాలని, వాహనాల రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు.
ఎస్పీ వెంట డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి, కోదాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, స్థానిక ఎస్సై రవి, ఇతర సిబ్బంది అధికారులు ఉన్నారు.










