నల్గొండ : సరిహద్దుల వద్ద పకడ్బందీగా తనిఖీలు

నల్గొండ : సరిహద్దుల వద్ద పకడ్బందీగా తనిఖీలు

జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్

అడవిదేవులపల్లి , మన సాక్షి:

ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను అధికారులు తనిఖీలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ అన్నారు.

శుక్రవారం అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామం నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

చెక్ పోస్టుల వద్ద నగదు, మద్యం తదితర ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలు తరలింపు జరగకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం అడవిదేవులపల్లి తహశీల్దార్ కార్యాలయంను తనిఖీ చేసి, మండలంలోని పోలింగ్ బూత్ ల గురించి అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీవో చెన్నయ్య,డి.ఎస్.పి వెంకటగిరి,సీఐ సత్యనారాయణ,తాహసిల్దార్ సురేష్ బాబు,ఎంపీడీవో మసూద్ షరీఫ్,ఎస్ఐ హరిబాబు ఆర్ ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!