Telangana : రైతుల రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. మంత్రులు, అధికారులతో సమావేశం..!
Telangana : రైతుల రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. మంత్రులు, అధికారులతో సమావేశం..!
హైదరాబాద్, మన సాక్షి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15వ తేదీ లోగా రైతులకు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకుగాను అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో కలిసి ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేసి తీరాల్సిందే అని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ, వ్యయాల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసే లోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు వివిధ మార్గాలపై అధికారులతో చర్చించారు. రెండు లక్షల రుణమాఫీ కి సంబంధించి వీధి విధానాల తో ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రుణమాఫీకి సంబంధించి అవసరమైతే రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడా నిధులను సర్దుబాటు చేయాలని అన్నారు. రైతులను రుణ విముక్తులను చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, నిర్ణయించిన గడువు లోపు నిధులు సమీకరించి రుణమాఫీ చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు బ్యాంకర్లను సంప్రదించాలని సీఎం పేర్కొన్నారు.
మహారాష్ట్ర , రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలో అనుసరించిన విధి విధానాలను అధ్యయనం చేసి రైతు రుణమాఫీకి మార్గం సుగమం చేయాలన్నారు. అదేవిధంగా వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తి చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం వేగవంతంగా కొనుగోలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఇటీవల లోకసభ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం విధితమే. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఒక వేళా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని కూడా సవాల్ చేశారు. ప్రతి సవాలుగా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తామని హరీష్ రావు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పిన విషయం విధితమే. ఏదేమైనా ఆగస్టు 15లోగా రైతులు తీపి కబురు అందుకోనున్నారు.
ALSO READ :
డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!
IPL 2024 – RCB ప్లే ఆప్స్ కు వెళ్తుందా.. వెళ్లాలంటే ఏం చేయాలి, అభిమానుల్లో ఉత్కంఠ..!
IPL : ముంబై కి బై బై.. ఆ ఛాంపియన్ ఇక ఏ జట్టుకు వెళ్తాడో..?
Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!










