Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Civils : సివిల్స్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా వాసికి ఉత్తమ ర్యాంక్

Civils : సివిల్స్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా వాసికి ఉత్తమ ర్యాంక్

అనంతగిరి , మనసాక్షి
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన గ్రందే సాయికృష్ణ మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయి293 ర్యాంకు సాధించి ఐఏఎస్ గా ఎంపిక అయ్యారు.

 

సాయి కృష్ణ ఒకటో తరగతి రెండవ తరగతి వరకు ఖానాపురం గ్రామంలో తదనంతరం మూడవ తరగతి నుండి 10 వరకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో చదివారు. ఇంటర్ శ్రీ గాయత్రి విజయవాడ కళాశాలలో చదివాడు. బీటెక్ ఎన్ఐటి కేరళ రాష్ట్రంలోని క్యాలికట్లో చదివారు.

 

అనంతరం ఇంటి వద్ద నుండే సివిల్స్ కు ప్రిపేర్ ర్యాంకు సాధించినట్లుగా తెలిపారు. ప్రస్తుతం సాయి కృష్ణ తండ్రి కొత్తగూడెంలోని ప్రైవేట్ రెస్టారెంట్లో మేనేజర్ గా, తల్లి నాగలక్ష్మి ప్రైవేటు టీచర్గా విధులు కొనసాగిస్తున్నారు.

ఐఏఎస్ తో తన కల నెరవేరిందని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలు నెరవేస్తానని వారి ప్రోత్సాహంతోనే సివిల్స్ లో ర్యాంకు సాధించాను అన్నారు. ఐఏఎస్ గా ఎంపిక కావడంతో ఖానాపురం గ్రామంలో సంబరు వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్ జొన్నగడ్డ శ్రీనివాసరావు సాయి కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు