Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

CM KCR : ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఏమైంది.. రోడ్డెక్కిన రైతులు..!

CM KCR : ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఏమైంది.. రోడ్డెక్కిన రైతులు..!

నష్టపరిహారం కోసం రోడ్డు ఎక్కిన రైతన్నలు

మద్దతు తెలిపిన కమ్యూనిస్టులు

అర్వపల్లి , మన సాక్షి :

రైతులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ నీటి మూటలుగా మిగిలింది. నష్టపరిహారం కోసం ఐదు మాసాలుగా ఎదురుచూస్తున్నారు. కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు. అకాల వర్షంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎకరానికి పదివేల రూపాయల పరిహారాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికీ ఐదు మాసాలు గడిచినా కూడా రైతులకు అష్టపరిహారం అందలేదు. దాంతో కడుపు మండిన రైతులు సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలానికి చెందిన రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వారికి సిపిఎం నాయకులు మద్దతు తెలియజేశారు.

ఐదు నెలల క్రితం కురిసిన రాళ్ల వాన అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికి నష్టపరిహారం అందించకపోవడం చాలా దురదృష్టకరమని సూర్యపేట జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రైతులు సూర్యాపేట జనగాం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మద్దతు తెలుపుతూ రైతులకు సంఘీభావం ప్రకటించి నిరసన తెలియజేశారు.

మార్చి ,ఏప్రిల్ నెలలో వడగండ్ల వానతో మండల పరిధిలోని అర్వపల్లి , రామన్నగూడెం,  వేల్పుచర్ల,  కుంచమర్తి , అడి వేముల, సాకలి గూడెం గ్రామాలలో వేలాది రూపాయల పంట నష్టం జరిగినట్లు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తానని ప్రకటించి ఐదు మసా లు దాటిన రైతులకు నష్ట పరిహారం అందలేదని అన్నారు .

ఎకరానికి 20 వేల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని అన్నారు . రైతులకు రుణమాఫీ పూర్తిగా రా లేదని నష్ట పరిహారం కూడారాకపోవడంతో రైతులకు వ్యవసాయ పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నా రన్నారు. రస్తారోకోవలన 365 ప్రధాన రహదారి పైన వాహనాలు నిలిచిపోవడంతో పోలీసు అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి రైతులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు చెరుకు ఏగలక్ష్మి , సిపిఎం మండల కార్యదర్శి , వాజ్జా శ్రీనివాస్ , మండల కమిటీ సభ్యులు వినయ్,  యాదవ్ శివ , వెంకన్న , బాలయ్య, కొమ్ము విజయ్, సిగ శ్రీను, రవి, రైతులు కృష్ణయ్య, సుధాకర్ , భద్రయ్య , సుమ, నరసయ్య పాల్గొన్నారు.

ALSO READ : 

  1. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
  2. Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
  3. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
  4. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  5. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు