Telangana : రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేవంత్ ప్రజాదీవెన సభ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండల కేంద్రంలో సోమవారం జరిగే ప్రజాదీవెన సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ప్రజలు భారీగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telangana : రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేవంత్ ప్రజాదీవెన సభ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం..!

ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

దమ్మపేట, మన సాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండల కేంద్రంలో సోమవారం జరిగే ప్రజాదీవెన సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ప్రజలు భారీగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలో సుమారు 7 ఎకరాల స్థలంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులతో చర్చించారు.

ALSO READ : Telangana : తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి శుభవార్త.. మరో మూడు గ్యారెంటీల అమలు..!

జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డీఎస్పీ, సీఐ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.సుమారు లక్ష మందిపై కూర్చునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అదే విధంగా సభ వద్ద జర్నలిస్టులు, మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చునేలా బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పలు ప్రాంతాల్లో వాహనాలు అపేందుకు పార్కింగ్‌ స్థలాలను పోలీసులు ఏర్పాటు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి సభకు నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి, అలాగే జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున్న ప్రజలు తరలిరానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. సభ ఏర్పాట్లలో దయాకర్ రెడ్డి, తుళ్లూరి బ్రమ్మయ్య,డిసిసిబి మాజీ చైర్మన్ , కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మువ్వా విజయ బాబు డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు,ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Mega Plan 2050 : త్వరలో వైబ్రంట్‌ తెలంగాణ 2050, మెగా మాస్టర్‌ ప్లాన్‌.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!