సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం – ఎమ్మెల్యే భాస్కరరావు

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం – ఎమ్మెల్యే భాస్కరరావు

మిర్యాలగూడ, మన సాక్షి: ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ ఎఫ్) పేదలకు వరం లాంటిదని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 60మంది లబ్దిదారులకు మంజూరైన 29 లక్షల 9 వేల రూపాయల విలువ గల చెక్కులను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, నల్గొండ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి లబ్దిదారులకు అందజేశారు.

కార్యక్రమంలో నల్లగొండ జిల్లా రైతు బందు సమితి సభ్యులు వీరకోటి రెడ్డి, డి సి ఎం ఎస్ వైస్ చైర్మన్ దుర్గం పూడి నారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నాయకులు అంగోతు హతిరాం నాయక్, ఎం.డి యూసుఫ్, ధీరావత్ రవితేజ, ఇరుగు వెంకటయ్య, పోకల రాజు, వేములపల్లి మండల పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ జేర్రిపోతుల రాములు గౌడ్, పాదురి సంజీవ్ రెడ్డి, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, స్థానిక కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎం.పీ.టీ.సీలు, గ్రామ శాఖ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.