Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

కలెక్టర్ సారూ.. మా గోస ఆలకించండి..!

కలెక్టర్ సారూ.. మా గోస ఆలకించండి..!

టేక్మాల్, మనసాక్షి :

తాతల వారసత్వం నుంచి వచ్చిన భూమిని సైతం దున్నుకోనీయకుండా అడ్డు తగులుతూ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని కుసంగి గ్రామానికి చెందిన బాధితురాలు సుభద్రా రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేసింది.

గురువారం టేక్మాల్ ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ మండల పరదిలోని కూసంగి గ్రామంలో 238,240, 552/ఆ,554,557,571 సర్వే నెంబరు గల భూమి సుభద్రారెడ్డి కి చెందిన 35 ఎకరాల భూమి ఉందన్ని ఈ భూమి తన తాత అయినా సంగమేశ్వర్ రెడ్డి కొడుకు కొండారెడ్డి కూతురు సుభద్రారెడ్డి కి వ్రాయించి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డులు ఉన్నాయని చెప్పి చూపారు.

తన సోదరుడితో పాటు కొందరు రాజకీయ నాయకుల ప్రమేయంతో భూకబ్జాకు పాల్పడుతూ తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని గతంలో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం ద్వారా వివరించినట్లు ఆమె చెప్పారు.

అప్పట్లో మౌనంగా ఉన్నరు. కాగా తిరిగి భూమిని దున్నేందుకు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ సాగు చేయనీయకుండా అడ్డు తగులుతున్నారని ఆమె చెప్పారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు వారికి వత్తాసు పలుకుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

MOST READ :

  1. Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!

  2. Schools : తెలంగాణలో స్కూళ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తాజా ఉత్తర్వులు జారీ..!

  3. KCR : ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ.. కెసిఆర్ ఏం చెప్పారో..!

  4. TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు