Karimnagar : వామ్మో.. ఈ దొంగ మామూలోడు కాదు..!
Karimnagar : వామ్మో.. ఈ దొంగ మామూలోడు కాదు..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున కమ్మరపల్లి గ్రామం, నిజాంబాద్ జిల్లా, ప్రస్తుతం ఏసపల్లి ఆర్మూర్ మండలంలో నివాసముంటున్న టేకు చిరంజీవి (22) అనే అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని నుండి భారీ మొత్తంలో దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, మరియు దొంగతనాలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిజామాబాద్ జిల్లాకు చెందిన టేకు చిరంజీవి (22) హార్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను పగలంతా తాళం వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతను తన మారుతి ఫ్రాంక్స్ కారు (నెంబర్ టిజీ 16-ఏ -7015)లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని వేర్వేరు గ్రామాల్లో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు.
ఈ మేరకు దొంగిలించిన వస్తువులను పోలీసులు నిందితుల నుండి మొత్తం 18 తులాల బంగారం, 164 తులాల వెండి, రూ. 1,00,000/- నగదు, ఒక మొబైల్ ఫోన్, దొంగతనాలకు ఉపయోగించిన మారుతి ఫ్రాంక్స్ కారు, ఇనుప రాడ్లు, గ్లౌజులు వంటి పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కమీషనరేట్ పరిధిలో దొంగతనాల నివారణకు పోలీసులు నిఘా పెంచుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఏసిపి వెంకటస్వామి, సి.సి.ఎస్ ఏసిపి జాన్ నర్సింహులు, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్ ప్రకాష్, ఎల్.ఎం.డి. ఎస్సై శ్రీకాంత్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ నరేష్, జైపాల్ , సీసీఎస్ కానిస్టేబుళ్లు రాజశేఖర్ , వేణుగోపాల్, అనిల్, అవినాష్ లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా పోలీస్ అభినందించారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం.. 15 మంది సస్పెండ్, 47 మంది ఎంపీ ఓ లకు షోకాజ్..!
-
Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!









