కమ్యూనిస్టులు గెలిచే సీట్లు మాత్రమే అడగాలి : ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ సునామీలో బిఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని 41వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా తెలంగాణ వస్తుందని అన్నారు.

కమ్యూనిస్టులు గెలిచే సీట్లు మాత్రమే అడగాలి : ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్ సునామీలో బిఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయం

ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు

నల్గొండ, మన సాక్షి.
కాంగ్రెస్ పార్టీ సునామీలో బిఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని 41వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా తెలంగాణ వస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకటో తారీకునే ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కేసీఆర్ రాజరిక పాలనకు అంతమవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కెసిఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కూతురు కవిత ఓడిపోగా మళ్లీ ఆమెకు ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టాడని అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతున్న ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం లేదని విమర్శించారు.

కవిత తెలంగాణలో బతుకమ్మ ఆడుతూ ఢిల్లీలో మాత్రం లిక్కర్ అమ్మకాలలో చిక్కుకుందని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ మోసపూరిత పాలనకు చరమగీతం పాడడానికి ఈ ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ స్కీములతో పాటు ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు.

ALSO READ : BIG BREAKING : కత్తితో దాడి ఘటన లో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్.. యశోద ఆసుపత్రికి తరలింపు..!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలలో విజయం సాధిస్తుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ పాల్గొనే భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలన్నారు. కమ్యూనిస్టులు గెలిచే సీట్లనే అడగాలని,ఓడిపోయే సీట్లను అడిగితే మళ్లీ టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్నారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు..అనంతరం ఎంపీతో కలిసి కొద్దిసేపు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ , స్థానిక కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య. యామమురలి సమద్, కేసాని కవిత, సుంకు ధనలక్ష్మి, కన్నారావు, సూరెడ్డి సరస్వతి, ఏడుదొడ్ల వెంకట్రామిరెడ్డి, వంగాల అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!