మిర్యాలగూడ : కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిక..!

మిర్యాలగూడ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుగంట్ల లింగయ్య యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

మిర్యాలగూడ : కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిక..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుగంట్ల లింగయ్య యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

మండలంలోని తుంగ పహాడ్ గ్రామానికి చెందిన లింగయ్య యాదవ్ తో పాటు మొత్తం 100 మంది బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి నల్లమోతు భాస్కరరావు గులాబీ కండవాలు కప్పి స్వాగతించారు.

ALSO READ : మిర్యాలగూడ : సిపిఎం నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి చేరిక..!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి ఆదరణ పెరిగిందన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికలో కారుగుర్తుకు ఓటేసి, భారీ మెజారిటీలో తనను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మట్టపల్లి సైదులు యాదవ్, నాయకులు సజ్జల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ బత్తుల లక్ష్మయ్య, తుమ్మల ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BIG BREAKING : గొడ్డళ్లు, కత్తులతో సూర్యాపేట బిఎస్పి అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై దాడి