మిర్యాలగూడ : సిపిఎం నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి చేరిక..!

మిర్యాలగూడ మండలంలోని జప్తివీరప్పగూడెం గ్రామానికి చేదిన సి. పి .యం పార్టీ మండల నాయకులు పేలపోలు శ్రీనివాస్ నాయకత్వంలో గ్రామాపంచాయతి వార్డ్ మెంబెర్స్ నలుగురు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మిర్యాలగూడ : సిపిఎం నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి చేరిక..!

మిర్యాలగూడ, మనసాక్షి :
మిర్యాలగూడ మండలంలోని జప్తివీరప్పగూడెం గ్రామానికి చేదిన సి. పి .యం పార్టీ మండల నాయకులు పేలపోలు శ్రీనివాస్ నాయకత్వంలో గ్రామాపంచాయతి వార్డ్ మెంబెర్స్ నలుగురు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారికి మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి భత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ కండువా కప్పి స్వాగతం పలికారు. వారితో పాటు, బి .ఆర్ .యస్, టి .డి. పి ,సి. పి .యం పార్టీల 50 కుటుంబాల కార్యకర్తలు సుమారు200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ALSO READ : మిర్యాలగూడ : గులాబీమయం.. కాంగ్రెస్ సన్నాసులంటూ రెచ్చిపోయిన కేటీఆర్..!

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గెలుపుకోసం కృషి చేసి కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని అన్నారు..

ఈ కార్యక్రమంలో స్కైలాబ్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, సానుభూతిపరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ALSO READ : BIG BREAKING : గొడ్డళ్లు, కత్తులతో సూర్యాపేట బిఎస్పి అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై దాడి