Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

ప్రజలను మభ్య పెట్టేలా కాంగ్రెస్ హామీలు

ప్రజలను మభ్య పెట్టేలా కాంగ్రెస్ హామీలు

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాలగూడ ఎంఎల్ఏ భాస్కర్ రావు

నల్గొండ , మనసాక్షి:

కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టేలా హామీలు ఇస్తున్నాదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
6 గ్యారంటీ హామీలు అన్ని ఉత్తివే అని, వారు అధికారంలో ఉన్న రాష్ట్ర లాల్లో ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు.

AlSO READ : Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !

ఏది చేయాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యం అవుతుంది. అది తెలంగాణ ప్రజలకు తెలుసు అని అన్నారు. కాంగ్రెస్ చెప్పేవి అన్ని బోగస్, కాంగ్రెస్ హామీలు ఆచరణలో సాధ్యం కాదు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు అన్నారు. కాంగ్రెస్ కు విజన్ లేదు, కేవలం అధికారం దాహమె ఉన్నదని, గ్యారంటీ హామీల్లో 2 లక్షల రుణమాఫీని ఎందుకు మర్చిపోయారు ?అన్నారు.

తెలంగాణ పై విషం, చిమ్మారు ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడాలని అన్నారు.
గుజరాత్ లో రక్తఫుటేరులు పారిన సంఘటనలు ఇంకా మోడీ మరువనట్లు ఉందని, అవే ఇప్పటికి మాట్లాడుతున్నాడు అన్నారు.

ALSO READ : Modi : తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. !

ఇంత మాట్లాడుతున్న మోడీ 2003 లో బీజేపీ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయలేదో?. చెప్పాలి అన్నారు. బీజేపీ చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్ని ఇన్ని కావని, ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లకు లొంగి 69లో తెలంగాణ ఇవ్వలేదు అన్నారు. కేసీఆర్ అలుపెరుగని పోరాట ఫలితంగానే కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిందని అన్నారు. ప్రజల ఒత్తిడి మేరకు తెలంగాణ ఏర్పాటు అయింది.
మోడీ మనసు నిండా విషం ఉందని, మోడీ మాట్లాడే దాంట్లో అర్థం లేదన్నారు.

తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన వ్యక్తి ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ పని, బీజేపీ పతనం ప్రారంభం అయిందని అందుకే మళ్ళీ మహిళ రిజర్వేషన్ బిల్లు అంటూ బీజేపీ హడావుడి చేస్తుంది అన్నారు. కుంభకోణలకు కేరాఫ్ అడ్రెస్ కాంగ్రెస్ పార్టీ అని, బోఫోర్స్ కుంభకోణంతో కాంగ్రెస్ పతనం అయింది అన్నారు.

మరిన్ని వార్తలు