Miryalaguda : మంద బలంతో కాంగ్రెస్ దురహంకారం.. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
Miryalaguda : మంద బలంతో కాంగ్రెస్ దురహంకారం.. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మంద బలంతో దురహంకారానికి పాల్పడుతోందని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసన సభ్యులను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.
దీనిలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు, మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో భాస్కర్ రావు పాల్గొని మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను భాస్కర్ రావు ఖండించారు. నిండు సభలో ఆడబిడ్డలకు అవమానించిన రేవంత్ రెడ్డి అన్ఫిట్ సీఎం అని విమర్శించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా కొనసాగాయని గుర్తు చేశారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమని భాస్కర్ రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్ష హోదాలో ఉన్న తాము డిమాండ్ చేయడం తప్పా? అని భాస్కర్ రావు ప్రశ్నించారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు విస్మరించారని భాస్కర్ రావు దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం,స్థానం ఉన్నదన్న కనీస సోయి లేకుండా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖందించాల్సిన అవసరం ఉందని భాస్కర్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్, జిల్లా బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఎండీ షెహనాజ్ బేగం, బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి షోయబ్, మహిళా కౌన్సిలర్లు కుర్రా చైతన్య, తిరుమలగిరి స్వర్ణలత వజ్రం, పట్టణ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు, కార్యదర్శి పెండ్యం పద్మ, కోదాటి రమా, సీనియర్ నాయకులు సందేశీ ఆంజనేయ రాజు, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, పల్నాటి జానకి రెడ్డి, రమావత్ చంటి, మాలవత్ రవీందర్ నాయక్, నరేష్, రామకృష్ణ, ఫయాజ్, గుర్రాల శ్రీకాంత్, నల్లంతుల నాగభూషణం, రాంబాబు, లావూరి శ్రీను నాయక్, ధనావత్ శంకర్ నాయక్, బచ్చు సాయన్న, దుర్గా ప్రసాద్, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
District collector : పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
Telangana : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం..!










