ఎన్నికలు దగ్గర పడగానే కాంగ్రెస్ పార్టీ టెంట్లు వేసి స్టంట్లు చేస్తది

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ఎన్నికలు దగ్గర పడగానే కాంగ్రెస్ పార్టీ టెంట్లు వేసి స్టంట్లు చేస్తది

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

సిద్దిపేట్ , మనసాక్షి :

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇట్టి ఆలయ పునరుద్ధరణకై 40 లక్షల రూపాయలను కేటాయిస్తూ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పొట్లపల్లి స్వయంభు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి పూజలు నిర్వహించారు.

అనంతరం హుస్నాబాద్ పట్టణంలో రెండు కోట్ల 80 లక్షలతో నూతనంగా నిర్మించే ఏసిపి కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.19 కోట్ల రూపాయలతో నిర్మించిన హుస్నాబాద్ డివిజన్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయంను ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిగా నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కృషి పట్టుదల వల్లనే సాధ్యమైంది అన్నారు.

ఒకప్పుడు హుస్నాబాద్ ప్రాంతమంతా గుంతల రోడ్లు ఉండేవని ఇప్పుడు అన్ని సీసీ రోడ్లు అయ్యాయని నియోజకవర్గాన్ని 7752 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. 2500 కోట్ల రూపాయలతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశామని గతంలో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ ఇప్పుడు కోనసీమ లాగా సస్యశ్యామలం కాబోతుంది అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల దగ్గర పడగానే టెంట్లు వేసి స్టంటులు చేస్తదని తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి బరువు లేదని కాంగ్రెస్ కు బాధ్యత లేదన్నారు.

ALSO READ : 

  1. Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
  2. సూర్యాపేట : ఘోర రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు మృతి, ఆమె భర్త కు తీవ్ర గాయాలు..!
  3. THUMMALA : తగ్గేదే లే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతా.. తుమ్మల స్పష్టం..!
  4. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!

అనంతరం నియోజవర్గంలో ఎన్నికల సన్నాహాక కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్ అని 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో రెండు వేల పెన్షన్ ఇచ్చారా..? కల్యాణ లక్ష్మి, మిషిన్ భగీరథ మంచినీళ్లు ఇచ్చారా..? తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలపాలన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు సృష్టించారని అయినా ప్రాజెక్టు పూర్తి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రైతుబంధు కింద 72,000 కోట్లు రైతుల అకౌంట్లో వేసామని 60 వేల కోట్లతో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కెసిఆర్ ఈనెల 16వ తేదీన ప్రారంభం చేయనున్నారని దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఆగమాగం అవుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతారావు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ స్థానిక శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ పోలీస్ కమిషనర్ శ్వేత జెడ్పీ చైర్పర్సన్ రాధాకృష్ణ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి ఎసిపి సతీష్ పురపాలక సంఘం చైర్మన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ ఐలేని అనిత సీఐ కిరణ్ ఎస్సై మహేష్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు తదితరులున్నారు.