Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసంగారెడ్డి జిల్లా
Congress to Brs | నిన్న కాంగ్రెస్ .. నేడు బి ఆర్ ఎస్.. !
నిన్న కాంగ్రెస్ .. నేడు బి ఆర్ ఎస్.. !
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి గ్రమపంచాయతీ 8వ వార్డు సభ్యురాలు శరణమ్మ విట్టల్ నిన్న కాంగ్రెస్ లో చేరి, బుధవారం తిరిగి బిఆర్ఎస్ లో చేరారు. ఈ మేరకు గురువారం కంగ్టి లో బీఆర్ఎస్ యువ నాయకుడు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యురాలు బిఆర్ఎస్ కండువా కప్పుకొని సొంత గూటిలో చేరారు.
ఈ సందర్భంగా యువ నాయకుడు కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టతకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అస్టురే రఘుగోండ, తొంట లక్ష్మణ్, మారుతి గౌడ్, కో ఆప్షన్ మెంబర్ మోహిన్ భాయ్ జావేద్ వార్డు మెంబర్, ఉప సర్పంచ్ గణపతి భీమన్న ఉప్పరి తదితరులు పాల్గొన్నారు.









