ఆవు కడుపున సింహం పిల్ల , వింత ఘటన చూసేందుకు ఎగబడుతున్న జనం
ఆవు కడుపున సింహం పిల్ల , వింత ఘటన చూసేందుకు ఎగబడుతున్న జనం
మనసాక్షి , వెబ్ డెస్క్ :
ఆవు కడుపున సింహం పిల్ల పోలిన ఆవు దూడ పుట్టింది. ఈ ఘటన సంచలనం కలిగించింది. ఈ వింత ఘటన చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని రైసెన్ జిల్లా గూర్ఖా గ్రామంలో జరిగింది.
వివరాల ప్రకారం… ఆ గ్రామంలోని వత్తులాల్ శిల్పాకర్ అనే రైతు ఆవుకు సింహం పోలిన దూడ జన్మించింది. ఈ ఘటన గ్రామంలో దావనంలా వ్యాపించడంతో చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సంఘటనకు వైద్యులు కూడా కంగుతిన్నారు. ఆవు గర్భం గర్భాశయంలో లోపం వల్లనే ఇలాంటి సంఘటన సంభవించిందని పశువైద్యులు పేర్కొన్నారు.
పశువైద్యాధికారి తివారి మాట్లాడుతూ… ఇది ప్రకృతి అద్భుతం కాదని, పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అని పేర్కొన్నారు. గర్భాశయంలో లోపం కారణంగానే ఇలాంటి దూడ జన్మించిందని తెలిపారు.
కాగా ఈ దూడ జన్మించిన వెంటనే పూర్తి ఆరోగ్యంగా ఉందని, కానీ 30 నిమిషాల్లో మృత్యువాత పడిందని చెప్పారు . చనిపోయిన సింహం ఆకారం పోలిన దూడను చూసేందుకు ఆ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.










