సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో మోడీ రాజీనామా చేయాలంటూ నిరసన

సిపిఐ , సిపిఎం ఆధ్వర్యంలో మోడీ రాజీనామా చేయాలంటూ నిరసన

దమ్మపేట  , మనసాక్షిప్రతినిధి ,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం కేంద్రంలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో మణిపూర్ లో జరిగిన సంఘటకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించి తక్షణం రాజీనామా చేయాలని ప్రదర్శన నిరసన తెలిపారు .

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కరరావు సిపిఎం జిల్లా నాయకులు దొడ్డ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మణిపూర్లో గత ఆరు నెలలుగా అక్కడున్న మహిళలపై బిజెపి నాయకులు కార్యకర్తలు అరాచకాలు చేస్తూ మహిళల పై మానభంగాలు అవిశ్రాస్తులను చేసి రోడ్లమీద ఊరేగించి వారిని భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళ మానప్రాణాలను దోచుకుంటూ హింసను సృష్టిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

దీనికి బాధ్యత వహించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చేయాలని కేంద్ర లో ఉన్న నరేంద్ర మోడీ తక్షణం రాజీనామా చేయాలని ఇదే విధంగా కొనసాగిస్తే తక్షణ ఈ నరేంద్ర మోడీకి బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి అతి త్వరలోనే చెప్తారని వీళ్ళ కార్యకర్తలు నాయకులను కూడా ప్రజలు కొడతారనిహెచ్చరించారు.

 

ALSO READ :

Telangana : తెలంగాణలో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు..!

 

ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతం చేయాల్సిందేనని భారత దేశ పౌరులు ఏకకంఠముతో కోరుతున్నారని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు తంగేళ్ల ముడీ శివకృష్ణ. సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ. నక్క నాగమణి .రాధిక .మహిళా సమితి నాయకురాలు తుపాకుల శాంతి .గా జు బోయిన కృష్ణవేణి. గొర్రెపాటి బసవయ్య .నాగు .జేమ్స్. జాన్ బి .సత్యవతి .కొప్పుల శ్రీను. కొలిగిపోగు శ్రీను .మళ్ళా సత్యం. వెంకటేశ్వరరావు .తదితరులు పాల్గొన్నారు.