Telangana : తెలంగాణలో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు..!

Telangana : తెలంగాణలో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు..!
హైదరాబాద్ , మనసాక్షి :
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధ , గురు 26 ,27వ తేదీలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలకు రెండు రోజులపాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. 26 , 27వ తేదీలలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
ALSO READ :
1. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
2. Cheater : చీటర్ మూవీ ఫస్ట్ లుక్..!
3. Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !
మంగళవారం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి విద్యార్థుల తల్లిదండ్రులు ట్విట్టర్లో వెల్లువలా ట్విట్ చేశారు . వర్షాలు నేపథ్యంలో విద్యార్థులను పాఠశాలలకు తీసుకువెళ్లి తీసుకురావడం ఇబ్బందులుగా ఉందని, రోడ్లపై గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.
కాగా భారీ వర్షాల నేపద్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 26, 27వ తేదీలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.