Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !

Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు ఈనెల 25 తో పాటు 26, 27వ తేదీలలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

 

ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల పలుచోట్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ద్విచక్ర వాహనాలు సైతం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 26 27వ తేదీలలో రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కుండ పోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

హైదరాబాద్ మహానగరం తో పాటు వరంగల్ పట్టణంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల రెండు రోజులపాటు సెలవులు ప్రకటించాలని వెల్లువలా వినతులు వస్తున్నాయి.

 

ALSO READ : 

1. Rain : తెలంగాణలో మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..!

2. వేములపల్లి : ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు, రిమాండ్..!

3. GOOGLE : మీరు ఇలా చేయకుంటే Google త్వరలో మీ Gmail , YouTube ఖాతాలను తొలగిస్తుంది..!

 

ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ట్విట్టర్ వేదికగా విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. వర్షాకాలం వల్ల రోడ్డు పరిస్థితి అద్వానంగా ఉందని, గుంతలమయంగా ఉన్న రోడ్లతో పాటు వర్షం వల్ల విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లడం, తీసుకురావడం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు.

 

దయచేసి పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కోరుతున్నారు. పిల్లలు ప్రస్తుత పరిస్థితులలో పాఠశాలలకు వెళ్లడం సురక్షితం కాదని, రోడ్లపై నీరు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ట్విట్టర్లో పలువురు పేర్కొంటున్నారు. కాగా వెలువల వస్తున్న ట్విట్టర్ వినతుల వల్ల ప్రభుత్వం , మంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు