వేములపల్లి : ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు, రిమాండ్..!

వేములపల్లి : ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు, రిమాండ్..!

వేములపల్లి జూలై 23 మన సాక్షి

ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి వేములపల్లి పోలీసులు రిమాండ్ కు పంపారు . నల్గొండ జిల్లా వేములపల్లి ఎస్ఐ ఎస్సై శ్రీను తెలిపిన వివరాల ప్రకారం ..

 

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి రిమాండ్
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని మోసం చేసిన వ్యక్తి వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆదివారం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచడం జరిగింది. వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన కోదాటి శ్రీనివాస్ ఒక టీవీ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.

 

(నిందితుడు కోదాటి శ్రీనివాస్)

 

గత మూడు సంవత్సరాల క్రితం మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన కందుల నాగిరెడ్డి తోపాటు జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురి నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని 42 లక్షల రూపాయలు తీసుకున్నాడు.

 

ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో పాటు డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మిర్యాలగూడ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడం జరిగింది. నిందితుడు శ్రీనుకు న్యాయస్థానం 14 రోజులపాటు విధించింది.

 

మిర్యాలగూడ సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు .ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాము.