Cheater : చీటర్ మూవీ ఫస్ట్ లుక్..! 

లాంచ్ చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాధ రావు

Cheater : చీటర్ మూవీ ఫస్ట్ లుక్..! 

లాంచ్ చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాధ రావు

చింతపల్లి, మనసాక్షి.

నేటి సమాజంలో సైన్స్ విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆదు నూతన టెక్నికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ పరికరాలతో సమాజంలో జరుగుతున్న నిజాలను కళ్ళకు అద్దం పట్టే విధంగా డైరెక్టర్లు ఎంతో ఆయా ప్రయాసలకు లోనై శ్రమ ఒడిసి నూతన విధానంతో చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళుతున్నామని ” ధమాకా మూవీ డైరెక్టర్ ” నక్కిన త్రినాధరావు పేర్కొన్నారు.

 

నేడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ పరిశ్రమ నిర్వాహకులు ఒక కొత్త మెసేజ్ ని సమాజానికి అందించాలని ఉద్దేశంతో సినీ పరిశ్రమలో ముందడుగు వేస్తున్నారు అన్నారు. సమాజంలో జరుగుతున్న. జరిగిన కథ సారాంశాలను తెరపై ఎక్కించేందుకు నేటి డైరెక్టర్లు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ శ్రమ కోర్చి నేడు తీసే మూవీలు ఎంతో ఆదరణ పొందుతున్నాయని డైరెక్టర్ త్రినాధరావు పేర్కొన్నారు.

 

సామాజిక రాజకీయ సేవా దృక్పథాలను కలిగినటువంటి సామాజిక కథ అంశాలను సమాజానికి అందించేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. కొట్లాది రూపాయల బడ్జెట్ తో నిర్మించే చిత్రాలు కొన్నిసార్లు నష్టం కలిగించడంతోపాటు, లాభాలు కూడా చేకూరుస్తాయని వారు వివరించారు. అందుకోసం నూతన డైరెక్టర్లు తక్కువ బడ్జెట్ సినిమాలను ఎన్నుకొని జాతీయ అవార్డు పొందే దిశలో ప్రయాణిస్తున్నారు.

 

ALSO READ : 

  1. Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !
  2. Social media : సోషల్ మీడియా యాక్టివ్ యూజర్స్ 500 కోట్లు.. జనాభాలో 60 శాతంకు పైగానే..!

 

అందులో బాగానే పెద్ద డైరెక్టర్లు చిన్న హీరోలతో పెద్ద అవార్డులు పొందేందుకు శ్రమోర్చుతున్నారన్నారు., ” చీటర్ మూవీ ” తెరకెక్కించేందుకు డైరెక్టర్ త్రినాధరావు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ” ఈ చీటర్ మూవీలో ” హీరోగా నరేంద్ర, చంద్రకాంత్, హీరోయిన్ గా రేఖ నిరోషా, నటించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.

 

ఈ చిత్రం ఎన్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై పరపతి శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో బర్ల నారాయణ, దర్శకత్వం వహిస్తున్న, ” చీటర్'” అనే సినిమాను ఫస్ట్ లుక్ ” ధమాకా డైరెక్టర్ ” నక్కిన త్రినాధరావు చేతుల మీదుగా సోమవారం హైదరాబాదులో రిలీజ్ చేయడం జరిగింది. చీటర్ ఫస్ట్ లుక్ ను ఎంతో ఆకర్షణంగా యువతను ఆకట్టుకునే విధంగా ఈ మూవీ చిత్రీకరించడం జరుగుతుందన్నారు.

 

అదేవిధంగా ఈ సినిమా సెన్సార్ను కూడా పూర్తి చేసుకుందని డైరెక్టర్ వివరించారు. అనంతరం వారు చిత్ర బృందాన్ని ప్రశంసించారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానున్నదని వారు పేర్కొన్నారు. ఈ చిత్ర నిర్మాణం అన్ని విధాలుగా విజయం సాధించేందుకు ఎంతో కృషి చేస్తున్న ప్రముఖ వ్యక్తులు చాయాగ్రహ నిర్వాహకులు గోవింద్ బాబు, చర్ల, సంగీతం అర్జున్, ఎడిటర్ శ్రీకాంత్ అట్టలూరి, ఫైట్స్ మాస్టర్ డైమండ్ వెంకటేష్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ నారాయణ బర్ల, కొరియోగ్రాఫర్ సూర్య కిరణ్, కాస్ట్యూమ్ డిజైనర్ మనోజ్ ఎం కేఎస్, లు వ్యవహరిస్తున్నారు,

 

ALSO READ : 

  1. Project K : ప్రభాస్ ప్రాజెక్టు కె గ్లింప్స్ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్ లో..! (వీడియో)
  2. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!
  3. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

 

ఈ చీటర్ మూవీ హీరోగా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చెందిన హీరో నరేంద్ర చింతపల్లి మండలం కురుమేడు గ్రామానికి చెందిన స్వర్గీయ కీర్తిశేషులు అండేకర్ నర్సోజి చిన్న కుమారుడు నరేంద్ర ఈ మూవీ ఈ మూవీలో హీరోగా నటించడం జరుగుతుందన్నారు. నరేంద్ర కు చిన్ననాటి నుండి సినిమాల్లో నటించాలని ఎంతో మక్కువ పెంచుకున్నారని అందుకోసం ఎంతో ఆసక్తితో నటన రంగాన్ని ఎంచుకొని చిత్ర పరిశ్రమకు దగ్గరవుతున్నారు.

 

నల్లగొండ జిల్లా వాసుడైన నరేంద్రను ప్రతి ఒక్కరు జిల్లా ప్రజలు ఆశీర్వదించి మరిన్ని సినిమాలు తీసేలా ప్రతి ఒక్కరు దీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమ యూనిట్ సభ్యులు పలువురు డైరెక్టర్లు నిర్మాతలు అభిమానులు ప్రేక్షకులు ఫస్ట్ లుక్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు