Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

MIRYALAGUDA : ఘనంగా జననేత రాగ్యానాయక్ వర్ధంతి..!

MIRYALAGUDA : ఘనంగా జననేత రాగ్యానాయక్ వర్ధంతి..!

మిర్యాలగూడ , మన సాక్షి :

జన హృదయనేత, గిరిజన భాందవుడు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు స్వర్గీయ దీరావత్ రాగ్య నాయక్ 23వ వర్ధంతి ఆదివారం మిర్యాలగూడలో ఘనంగా జరిగింది. ఈ సంధర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ శాసన మండలి చీప్ విప్ దీరావత్ భారతీ రాగ్యనాయక్, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతవాత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాగ్యనాయక్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎనలేనిదన్నారు.

జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారనీ చెప్పారు. గిరిజనుల అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకు దీరవత్ స్కైలాబ్ నాయక్, నాయకులు మహబూబ్ అలీ, శ్రీనివాస్, వేణుగోపాలరెడ్డి, వెంకటేష్, మాజీ ఎంపీపీ నందిని రవితేజ, చిలుకూరి బాలు, సీతారారం నాయక్, మాత్రు నాయక్, భాస్కర్ నాయక్, రమేష్, దాస్యనాయక్, చక్రి, తదితరులు పాల్గొన్నారు.

బంజారా ఉద్యోగుల సంఘం నివాళులు :

రాగ్యానాయక్ 23వ వర్ధంతి సందర్భంగా ఆదివారం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొని ప్రత్యేకంగా రాగ్యనాయక్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోధ్ దశరథ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ బంజారాల అభివృద్ధికి రాగ్యనాయక్ విశేష కృషి చేశారనీ చెప్పారు.

బంజారా ఉద్యోగుల, తండాల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మక్లనాయక్, భీమ్లనాయక్, బాబుసింగ్, నానిక్య నాయక్, లాలు నాయక్, చందునాయక్,సేవ్య నాయక్, రవి నాయక్, భాషా నాయక్, మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు