ప్రజా వ్యతిరేక బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించండి : ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

జాగో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఓటర్ల చైతన్య యాత్ర బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుంది.

ప్రజా వ్యతిరేక బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించండి : ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

నల్లగొండ , మనసాక్షి:

జాగో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఓటర్ల చైతన్య యాత్ర బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల అంబేద్కర్ విగ్రహం, గడియారం సెంటర్ జిల్లా గ్రంధాలయాల్లో , సభలు నిర్వహించి నిరుద్యోగులతో మాట్లాడారు.

ఈ యాత్ర కార్యక్రమంలో ఆకునూరు మురళి మాజీ కలెక్టర్ జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పాల్గొని మాట్లాడుతూ, దేశంలో రాష్ట్రంలో అవినీతి నియంతృత్వంతో దోపిడీ చేస్తున్న బిజెపి టిఆర్ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు . మద్యానికి . నోటుకు .కులానికి. మతానికి ,లోబడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పుష్కలంగా ఉన్నాయని వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన తెలంగాణ సమాజాన్ని నిర్మించవచ్చు అన్నారు.

ALSO READ : BIG BREAKING : కత్తితో దాడి ఘటన లో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్.. యశోద ఆసుపత్రికి తరలింపు..!

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో బిజెపి బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని అభ్యర్థులను నిలదీయాలి అన్నారు .నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడని రైతు రుణమాఫీ దలిత బంధు, కౌలు రైతులకు ఆర్థిక సాయం పంటల బీమా, ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ 15 లక్షల నల్లధనం అంశాలపై పాలకులు నిలదీయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యక వేదిక సలహాదారు ప్రొఫెసర్ వినాయక రెడ్డి టీజేఎస జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, సభ్యులు హనుమేష్ టిఎస్డిఎఫ్ కో కన్వీనర్ నైనాల గోవర్ధన్, ప్రదీప్ పి వై ఎల్ రాష్ట్ర నాయకులు రాజకుమార్, ఓయూ విద్యార్థి సంఘం నాయకులు ఇందూర్ సాగర్ ,పిడిఎఫ్ జిల్లా కార్యదర్శి పోలే పవన్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉంగరాల నరసింహ, ఏఐకే ఎం ఎస్ జిల్లా నాయకులు బీరేడ్ సత్తిరెడ్డి ,శ్రీనివాస్ ,రావుల సైదులు బాల నరసయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!