Miryalaguda : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎస్సీ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం..!
మిర్యాలగూడ లోని వాసవి నగర్‌లో ఎస్.వి మోడల్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100 శాతం ఫలితాలు సాధించారు. ఈ సంవత్సరం పరీక్షలకు హాజరైన 13 మంది విద్యార్థులు 13 మంది ఉత్తీర్ణత సాధించారు.

Miryalaguda : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎస్సీ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ లోని వాసవి నగర్‌లో ఎస్.వి మోడల్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100 శాతం ఫలితాలు సాధించారు. ఈ సంవత్సరం పరీక్షలకు హాజరైన 13 మంది విద్యార్థులు 13 మంది ఉత్తీర్ణత సాధించారు.
పరీక్షల్లో మ్యాథమెటిక్స్‌లో 100/100 మార్కులు నలుగురు విద్యార్థులు సాధించడం విశేషం. అలాగే 500కు పైగా మార్కులు ఆరుగురు విద్యార్థులు సాధించారు. పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో వరుణ్ 547 మార్కులు, మురారి 542 మార్కులు, స్వాతి 535 మార్కులు, ఝాన్సీ 525 మార్కులు, వరుణ్ 517 మార్కులు, శృతి 510 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ విద్యార్థులను అభినందించి, వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ బృందానికి స్వీట్స్ తినిపించి ఘనంగా సన్మానించడం జరిగింది.
విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.