Miryalaguda : పదవ తరగతి ఫలితాల్లో ఎస్పిఆర్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం..!
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మిర్యాలగూడకు చెందిన ఎస్పీఆర్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బుధవారం వెలువడిన ఫలితాలలో ఎస్పిఆర్ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.

Miryalaguda : పదవ తరగతి ఫలితాల్లో ఎస్పిఆర్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మిర్యాలగూడకు చెందిన ఎస్పీఆర్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బుధవారం వెలువడిన ఫలితాలలో ఎస్పిఆర్ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. పాఠశాలకు చెందిన శివ మన్విత్ రెడ్డి 600 మార్కులకు గాను 582 సాధించారు.
అదేవిధంగా రిత్విక్ 575 మార్కులు, అఖిల్ తేజ 575 మార్కులు, జాహ్నవి 574 మార్కులు, అఖిల 574 మార్కులు మాన్విత 571 మార్కులు, అక్షయ్ విలియం 571 మార్కులు, సాయి చందన 571 మార్కులు సాధించారు.
అదేవిధంగా 27 మంది విద్యార్థులు 550 కి పైగా మార్కులు సాధించగా 85 మంది విద్యార్థులు 500 కి పైగా మార్కులు సాధించారు. పరీక్షకు 99 మంది విద్యార్థులు హాజరుగా నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ జనార్దన్ రెడ్డి, డైరెక్టర్లు యామిని వెంకటేశ్వర్లు, గార్లపాటి ఉమాకర్ రెడ్డి, జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల అయ్యన్న, నీలిమారెడ్డి, కొనుగంటి శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి వీరయ్య, గంట వెంకట్ రెడ్డి తదితరులు అభినందించారు.
MOST READ :









