సాగర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత..! 

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో కృష్ణా నది తీరానికి సమీపాన నిర్మించిన నివాస గృహాల సముదాయాలను సోమవారం నాడు నందికొండ మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్యన కూల్చివేశారు.

సాగర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత..! 

నాగార్జునసాగర్ , మన సాక్షి :

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో కృష్ణా నది తీరానికి సమీపాన నిర్మించిన నివాస గృహాల సముదాయాలను సోమవారం నాడు నందికొండ మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్యన కూల్చివేశారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధి నుండి నందికొండ మున్సిపాలిటీ పరిధిలోకి మారిన తర్వాత నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు స్థలాలు ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణాలు వెలిశాయి దశాబ్ద కాలంగా ఈ అక్రమ నిర్మాణాలకు ఏ అధికారులు కూడా అడ్డుకట్ట వేయలేకపోయారు. కొందరు ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకొని, మరికొందరు ఆక్రమించుకున్న వారి వద్ద నుండి కొని నివాసాలను నిర్మించుకున్నారు.

ALSO READ : మిర్యాలగూడ : 50 రోజుల్లో రూ.14 వేల కోట్ల అప్పు.. రేవంత్ పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారికి ఇరువైపులా అన్ని సౌకర్యాలతో ,రెండు మూడు అంతస్తులతో అక్రమ నిర్మాణాలు జరిగిన అధికార ,రాజకీయ పలుకుబడితో వాటి పరంపర కొనసాగింది. నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో స్థానిక పోలీస్ స్టేషన్ వెనుక భాగాన కృష్ణానది తీరానికి సమీపంలో కొందరు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేసుకున్నారు.

ALSO READ : కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టు

కాగా ఈ నిర్మాణాలను సోమవారం తెల్లవారుజాము నుండి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పాల్గొని అక్కడి నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మాణం చేసుకొని నష్టపోయిన బాధితులు మాట్లాడుతూ నాగార్జునసాగర్ లో పలుచోట్ల నిర్మాణాలు చేసుకున్నారని, మరికొన్ని ఇంకా నిర్మాణం అవుతున్నాయని వాటి జోలికి పోకుండా తాము లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కట్టుకున్న నివాసాలను కూల్చివేయడం పై రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు.