దేవరకొండ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలు నాయక్ కు.. ఘన స్వాగతం..!

దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేనావత్ బాలునాయక్ కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో దేవరకొండ నియోజకవర్గం కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహం పెంపొందింది.

దేవరకొండ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలు నాయక్ కు.. ఘన స్వాగతం..!

చింతపల్లి. అక్టోబర్ 28 మన సాక్షి.

దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేనావత్ బాలునాయక్ కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో దేవరకొండ నియోజకవర్గం కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహం పెంపొందింది.

ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి దేవరకొండ నియోజకవర్గానికి బయలుదేరి వెళ్తున్న నేనావత్ బాలు నాయక్ చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్ నగర్ గోడకొండ కుర్మేడ్, వింజమూర్, చింతపల్లి, నసర్లపల్లి, తీదేడు, ఎక్స్ రోడ్లలో కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాకాయలు కాలుస్తూజై కాంగ్రెస్.. జై జై కాంగ్రెస్. అంటూ నినాదాలు చేస్తూ వారికి ఘనంగా స్వాగతం పలికారు.

యువకులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున వారిని శాలువాలతో వాళ్ళతో సన్మానించి పూలదండలు వేశారు. అనంతరం పోలేపల్లి రాంనగర్ సమీపంలో ఉన్నటువంటి అమ్మ వారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున కాన్వాయతో వారి వెంట ర్యాలీగా బయలుదేరి దేవరకొండకు వెళ్లారు.

ALSO READ : కాంగ్రెస్ లో అసమతి రాగం.. మునుగోడు టికెట్ ఆశించి బంగపడిన చల్లమల్ల సెల్ఫీ (వీడియో) వైరల్..!

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ఆంగిరేకుల నాగభూషణం, కొండూరు పవన్ కుమార్, పీసీసీ సభ్యులు జాలే నరసింహారెడ్డి. దొంతం సంజీవరెడ్డి, ఊరే లక్ష్మణ్, అంగిరేకుల గోవర్ధన్, అంగిరేకుల గోపాల్, గుండ్లపల్లి నర్సిరెడ్డి, దొంతం వెంకట నరసింహారెడ్డి, శ్రీధర్ రెడ్డి ముచ్చర్ల యాదగిరి, మాజీ జెడ్పిటిసి జటావత్ హరినాయక్ లింగంపల్లి వెంకటయ్య, మునుకుంట శేఖర్ గౌడ్, ఉప్పు శ్రీశైలం, కొప్పుల జంగయ్య గౌడ్, దొంత గోని శేఖర్ గౌడ్,

ఉప్పు శేఖర్, అంగిరేకుల జగదీష్, ఎండి రషీద్, అనంతుల రామకృష్ణ గౌడ్, కాసారం శ్రీనివాస్, సమ్మిడి రవి శంకర్ రెడ్డి, ఎలిమినేటి నరసింహ, వాంకుడోత్ శక్రు నాయక్, వై వెంకటయ్య గౌడ్ వాంకుడోత్ రవి నాయక్, రామిని నగేష్, రాజు గౌడ్, నేరటి వెంకటయ్య, రమేష్ యాదవ్, కాయితి జితేందర్ రెడ్డి, దాసరి శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదగిరి, పల్ల వెంకట యాదవ్, కురుమేటి రామకృష్ణ, దొంతం రంగారెడ్డి, ఏర్పుల చిన్న నరసింహ, ఎండి మజహార్ అలీ బిగ్ బాషా వీరితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

ALSO READ : Congress Party : ఆ 19 స్థానాలే కీలకం.. రేవంత్ రెడ్డికి పరీక్ష.. పోటాపోటీగా అభ్యర్థులు..!