Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను పరిష్కరిస్తాం..!

మున్సిపల్ వార్డుల వారీగా ఈనెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

Nalgonda : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను పరిష్కరిస్తాం..!

నల్లగొండ, మన సాక్షి:

మున్సిపల్ వార్డుల వారీగా ఈనెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై 825 అభ్యంతరాలు వచ్చాయని, ముఖ్యంగా ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులో రావడం, కుటుంబ సభ్యులకు వేరువేరు పోలింగ్ కేంద్రాలలో ఓట్లు రావడం, ఒక కాలనీ ఓటర్లు రెండు మూడు పోలింగ్ కేంద్రాలలో ఉండడం వంటి వాటిపై ఎక్కువగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలిపారు.

వార్డువారిగా ప్రచురించిన ఓటరు జాబితా పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పునః పరిశీలన చేస్తున్నామని, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అయన తెలియజేశారు. వీటన్నిటిని ఈ నెల 9 లోపు పరిశీలించి 10న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని,అంతలోపు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు తెలియజేయాలని కోరారు.

అక్టోబర్ 1, 2025 ఆధారంగా ఓటరు జాబితాలో అప్డేట్ అయిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, దీని ద్వారానే తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని వెల్లడించారు. ఏలాంటి తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.

అంతకుముందు స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపుకలెక్టర్ వై.అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 1న మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించడం జరిగిందని, అభ్యంతరాల స్వీకరణకై మున్సిపాలిటీలలో హెల్ప్ డెస్క్ తో పాటు, కంప్యూటర్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యంతరాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు.

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ తుది ఓటరు జాబితా ప్రకటించే ముందే వార్డు హద్దులను నిర్ణయించాలని, కొత్తగా ఇంటి నంబర్లు వచ్చిన చోట ఓటరు జాబితాలో టాలీ కావడం లేదని, ఒక ఇంట్లో ఓట్లు వేరే వేరే వార్డులకు వెళ్లడం జరిగిందని, అలాగే డబుల్ ఓట్లను, చనిపోయిన వారి ఓట్లను తొలగించాలని, మున్సిపల్ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ముసాయిదా జాబితా ముందే అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని, అద్దె ఇళ్లల్లో ఉన్న వారికి రెండు, మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని, అలాంటివి తొలగించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 800 ఓట్లకు మించి ఎక్కువ ఓటర్లు ఉన్నచోట్ల అదే లొకాలిటీలో మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్టోబర్ 1, 2025 ఆధారంగా బిఎల్ఓ ల ద్వారా ఫామ్ 7,8 లో తీసుకున్న వివరాల ఆధారంగా ఓటర్ల అప్ డేషన్ ఉంటుందని తెలిపారునేషనల్ కాంగ్రెస్ నుండి నర్సింహారావు, బిఆర్ఎస్ నుండి పిచ్చయ్య ,బిజెపి నుండి లింగస్వామి, ఎం ఐఎం నుండి మహమ్మద్ రజియుద్దిన్, టిడిపి నుండి రాజశేఖర్ రెడ్డి లు మాట్లాడారు.ఈ సమావేశంలో సిపిఎం నుండి నర్సిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు హాజరయ్యారు.

MOST READ : 

  1. Miryalaguda : ప్రజాదరణ పొందిన మనసాక్షి.. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..!

  2. Municipal Elections : అప్పుడే మున్సిపల్ ఎన్నికల హడావుడి.. మిర్యాలగూడలో అధికార పార్టీ నుంచి వలసలు..!

  3. Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!

  4. Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!

మరిన్ని వార్తలు