Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District Sp : జిల్లా ఎస్పీ కీలక ఆదేశం ఒక్క వాహనం కూడా వదలొద్దు..!

రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా జిల్లా పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, తెలిపారు.

District Sp : జిల్లా ఎస్పీ కీలక ఆదేశం ఒక్క వాహనం కూడా వదలొద్దు..!

నల్లగొండ, మన సాక్షి.

రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా జిల్లా పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, తెలిపారు. ఇందులో భాగంగా కోర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ముఖ్యంగా కంటైనర్ లారీలు, లోడ్ వాహనాలు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

వాహనాలకు సంబంధించిన పత్రాలు, పశువుల రవాణాకు అవసరమైన అనుమతులు, డ్రైవర్ల వివరాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు.అక్రమంగా పశువులను తరలించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు. రవాణా సమయంలో పశువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించినా, నిబంధనలకు విరుద్ధంగా తరలించినా సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ పశువులను రవాణా చేసే వ్యక్తులు తప్పనిసరిగా సంబంధిత అనుమతి పత్రాలు, కొనుగోలు రసీదులు, వెటర్నరీ ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు. వాహనాలలో సామర్థ్యానికి మించి పశువులను ఎక్కించరాదని, పశువులకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

రవాణా సమయంలో పశువులకు తాగునీరు, ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని, జంతు సంరక్షణ చట్టాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అక్రమ రవాణా లేదా అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డుకోవడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించినా వెంటనే డయల్-100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు లేదా సందేశాలు పంపించే వారిపై ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదేవిధంగా జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, చెక్‌పోస్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. టోల్ ప్లాజాలు, ప్రధాన రహదారులు, అంతర్‌జిల్లా సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పి వెంట నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, నకేరేకల్ సీఐ హరిబాబు, కేతపల్లి ఎస్.ఐ సతీష్, శాలిగౌరారం ఎస్.ఐ సైదులు మరియు సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు