ఆంధ్రప్రదేశ్Breaking Newsవిద్య
సుబ్బారావుకు డాక్టరేట్ ప్రధానం..!

సుబ్బారావుకు డాక్టరేట్ ప్రధానం..!
మదనపల్లి, మనసాక్షి:
మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గెనికల సుబ్బారావుకు మిజోరం రాష్ట్రములోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వారు డాక్టరేట్ పట్టాను అందచేసినట్టు మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు.
టెక్నాలజీ, డిజైన్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అబ్జార్బర్స్ ఫర్ మైక్రోవేవ్ / టెరా హెడ్జ్ అప్లికేషన్స్అను అంశం పై చేసిన పరిశోధన కు డాక్టరేట్ పట్టాను అందజేసినట్లు తెలిపారు. సుబ్బారావును యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, విభాగాధిపతి అధ్యాపకులు తదితరులు అభినందనలు తెలియజేసారు.









