Miryalaguda | డంపింగ్ యార్డ్ ను తరలించాలి

Miryalaguda | డంపింగ్ యార్డ్ ను తరలించాలి
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కాలనీల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించాలని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం డంపింగ్ యార్డ్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని కాలనీలా మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల కాలనీలా ప్రజలు దుర్వాసనతో, చెత్త చెదారాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Also Read : PM KISAN : పి ఎం కిసాన్ డబ్బులు ఎకౌంట్లోకి రావాలంటే రైతులు ఇలా చేయాలి..!
పట్టణానికి దూరంగా ఉండాల్సిన డంపింగ్ యార్డ్ పట్నంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వ్యర్థలు అన్ని నిల్వ చేయడం వల్ల దోమలు ఈగలు స్వైర్య చేస్తున్నాయని వాటి ఫలితంగా ప్రజలు అనారోగ్యాల పాలౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలో డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల ప్రజలతో పాటు పర్యావరణాన్ని కూడా నష్టం కలుగుతుందని చెప్పారు తక్షణమే డంపింగ్ యార్డ్ ను తరలించాలని లేనిపక్షంలో ప్రజలను సమీకరించి బలమైన ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
అనంతరం ఆడియో కార్యాలయంలోని డీఏవో రాధ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు,
Also Read : Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!
మూడవత్ రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి,శశిధర్ రెడ్డి పరుశురాములు, ఎండి అంజాద్, గాయం వెంకట రమణ రెడ్డి, పాపా రావు, ఫాతిమా బేగం, మున్నీ, పాదురి గోవర్ధన, బాబు నాయక్, గోవింద్ రెడ్డి, వాడపల్లి రమేష్,కరిమున్నిసా బేగం తదితరులు పాల్గొన్నారు.