Miryalaguda : కమనీయంగా దుర్గామాత శోభాయాత్ర..!

Miryalaguda : కమనీయంగా దుర్గామాత శోభాయాత్ర..!
మిర్యాలగూడ/ వేములపల్లి, మన సాక్షి:
వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో కనకదుర్గ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 11 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.మొదటి రోజు గాయత్రి దేవి అలంకారం చీర రూ:20,116 రూపాయలతో బొల్లెపల్లి ప్రవళిక వేలం పాట ద్వారా కైవసం చేసుకున్నారు.
నాలుగవ చీర లక్కీ డ్రా నిర్వహించగా అనంతుల శంకర్ గౌడ్ గెలుపొందారు. మిగతా చీరలను వేలం పాట ద్వారా చీముల నరేష్ రూ:11,116, వీరమల్ల రుత్విక రూ:7516, తమ్మిశెట్టి రాము రూ:12,216, తరికొప్పుల వెంకటేశ్వర్లు రూ: 6600, ఉత్తర్ల వెంకన్న రూ:10,000, శీలం ఆరాధ్య రూ:10,500, తరి సైదులు రూ:9200, సందనబోయిన నాగయ్య రూ:9100 రూపాయలతో సొంతం చేసుకున్నారు.
అనంతరం కనకదుర్గమ్మ శోభయాత్ర కమనీయంగా కొనసాగింది.కోలాట ప్రదర్శనతో పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. వేలం పాటలో పాల్గొన్న భక్తులకి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శోభయాత్రలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
MOST READ :
-
Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!
-
Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!
-
Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!









