Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!
Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణలో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. విద్యార్థులకు వచ్చిన ర్యాంకు ఆధారంగా కళాశాలలో సీట్లను కేటాయించారు. సీట్ల కేటాయింపు తొలి విడత 70 , 665 సీట్లను ఇంజనీరింగ్ లోని వివిధ బ్రాంచ్ ల వారిగా భర్తీ చేశారు. తొలి విడతలో ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో సీట్లు భర్తీ అయ్యాయి.
వీటిలో సుమారుగా 95 శాతం కు పైగా సీట్లు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ (ఈ ఈ ఈ )సీట్లు భర్తీ అయ్యాయి. దీనిలో 58 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అదే విధంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 44% , మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 38.5% సీట్లు భర్తీ అయ్యాయి.
ALSO READ :
1. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!
2. Tourism : తిరుమల, షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు..!
3. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!
4. TSRTC : హైదరాబాద్- తిరుపతి మార్గంలో డైనమిక్ ప్రైసింగ్ విధానం..?
ఈ సీట్లు భర్తీ కాగా మిగిలిన సీట్లు ఇంకా 12 వేల కు పైగా ఉన్నాయి. మూడు యూనివర్సిటీల్లో 28 ప్రైవేట్ కళాశాలలో 100% సీట్లు తొలివిడతలోనే భర్తీ అయ్యాయి.
ఆగస్టు 11 వరకు రిపోర్టు చేయాలి :
ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కు విద్యార్థులు వెబ్ ఆప్షన్ల గడువు ముగియడంతో జూలై 12వ తేదీ తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. కాగా రెండవ విడత కౌన్సిలింగ్ జూలై 24వ తేదీ నుంచి ఉంటుంది.
చివరి దశ కౌన్సిలింగ్ ఆగస్టు మొదటి వారంలో ఉంటుందని ఉన్నత విద్యా మండలి పేర్కొన్నది. తుది విడత కౌన్సిలింగ్ లో సీట్లు పొందిన వారు ఆగస్టు 11వ తేదీ వరకు ఆయా కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
ALSO READ :
1. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!
2. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!
3. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!









