నేడు ఎన్నికల షెడ్యూల్.. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..!

నేడు ఎన్నికల షెడ్యూల్.. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..!

12 గంటలకు మీడియా సమావేశం..!

న్యూఢిల్లీ, మన సాక్షి :

దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేయనున్నది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనున్నది.

దేశంలోని ఐదు రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్, మిజోరం లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది. ఈ ఐదు రాష్ట్రాలలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించనున్నది.

ALSO READ : Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!

తెలంగాణలో డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. తెలంగాణలో 119, మధ్యప్రదేశ్ లో 230, రాజస్థాన్ లో 200, చత్తీస్గఢ్ లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానున్నది.

ALSO READ : మిర్యాలగూడలో 10న కేటీఆర్ పర్యటన.. అధికారులతో ఎమ్మెల్యే కీలక సమావేశం..!