కూరగాయల వాహనం ఢీకొని మూడు ఏనుగులు మృతి

కూరగాయల వాహనం ఢీకొని మూడు ఏనుగులు మృతి

వాహనం వదిలి పరారైన డ్రైవర్

రాయలసీమ బ్యూరో, మన సాక్షి

ఏపీ లోని చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి సమీపంలో తిరుపతి బెంగళూరు నేషనల్ హైవే వద్ద జగమర్ల అటవీప్రాంతం నుంచి రోడ్డు దాటుతున్న ఏనుగులను కూరగాయలు తీసుకెళుతున్న వాహనం ఢీకొన్న ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయి.

 

బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన రెండు గున్న ఏనుగులు మరొకటి ఆడ ఏనుగు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలమనేరు వైపు నుంచి చెన్నై వైపు వేగంగా వెళుతున్న కూరగాయల వాహనం ఢీకొనడంతోనే మూడు ఏనుగులు మృతి చెందాయి.

 

వాహనం ఢీకొన్న ధాటికి రోడ్డుకు అవతల వైపుకు ఒక ఏనుగు ఎగిరిపడింది. మరో రెండు ఏనుగులు క్రాష్ బ్యారియర్స్ కు తగిలి మృతి చెందాయి.
ఇందులో వాహనం కూడా పూర్తిగా దెబ్బతినడంతో కూరగాయల వాహనాన్ని వదిలి డ్రైవర్ పరారయ్యాడు.

 

Also Read : Inter : ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు… ట్రైనింగ్ లోనే నెలకు రూ. 25 వేల వేతనం..!

ఈఘటనతో తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వెంటనే
ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరించారు.
కౌండిన్య అభయార్యణము నుంచి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.

 

Also Read : WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!

గురువారం ఉదయం జిల్లా అటవీశాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అంచనా వేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..

 

ఎప్పుడూ లేనివిధంగా ఇటువంటి ప్రమాదం చోటుచేసుకుని మూడు ఏనుగులు మృతి చెందడం దురదృష్టకరమని,ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు.

 

ఆయనతో పాటు పలమనేరు ఎఫ్.ఆర్.ఓ.శివన్న మరియు సిబ్బంది సమక్షంలో ఏనుగులకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి సమీపంలో ఖననం చేశారు.