Hyderabad : ఎన్యుమరేటర్లు సర్వే అంశాలు పొరపాటు లేకుండా నమోదు చేయాలి.. మయాంక్ మిట్టల్..!
Hyderabad : ఎన్యుమరేటర్లు సర్వే అంశాలు పొరపాటు లేకుండా నమోదు చేయాలి.. మయాంక్ మిట్టల్..!
శేరిలింగంపల్లి, మన సాక్షి
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా శేర్లింగంపల్లి జోన్లో వివిధ ప్రాంతాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలొ కుటుంబాల వారీగా వివరాల సేకరణకు సుపర్వైసర్లు, ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ఎన్యూమరేటర్ బ్లాక్ లలో సర్వే కొనసాగిస్తున్నారు.
జోన్ పరిధి లోని నల్లగండ్ల, డోన్స్ కాలనీ, చందానగర్,శాంతినగర్ ప్రాంతాలలో మానిటరింగ్ ఆఫీసర్ మయాంక్ మిట్టల్ ఐఏఎస్ , సర్కిల్ డిప్యూటీ కమీషనర్ పి. మోహన్ రెడ్డి, ముకుంద రెడ్డి ,ఇతర ఆఫీస్ సిబ్బంది పర్యటించారు.
అలాగే మానిటరింగ్ ఆఫీసర్ మయాంక్ మిట్టల్ , సూపర్వైజర్స్ ఎన్యూమరేటర్ బ్లాక్ లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్బంగా మానిటరింగ్ ఆఫీసర్ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ..
ఈ కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి ఎన్యుమరెటర్ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులము వివరములు జాగ్రత్తగా మార్గదర్శక పుస్తకంలో సూచించిన ప్రకారం పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని ఆదేశించడం జరిగింది.
అనంతరం జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రోజు సంబధిత నాలుగు వార్డుల ఇంచార్జిలు, సుపర్వైసర్లు పది శాతం ఎన్య్యూమరేటర్ల నమోదును క్షేత్ర స్థాయిలో తనిఖీ లు నిర్వహించి ఎన్యుమరేటర్లకు తగు మార్గదర్శకత్వం చేయాలని ఆదేశించారు.
ప్రజా ప్రతినిధులు, కాలనీ సంఘాలు మొదలైన వారు సర్వే సిబ్బందికి సహకరించి సమాచారం ఇవ్వాలని జోనల్ కమీషనర్ ఈ సందర్బంగా కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, ముకుంద రెడ్డి , మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉష, ఇతర అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : మిల్లర్ల సిండికేట్.. ధాన్యం ధరలు తగ్గింపు, రహదారిపై రైతుల ఆందోళనలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. కఠినమైన నిబంధనలు..!
-
RRC : రాత పరీక్ష లేకుండా టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. 5647 ఖాళీల భర్తీ..!
-
Miryalaguda : ధాన్యం మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కఠిన చర్యలు.. ఎమ్మెల్యే హెచ్చరిక..!









