తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

గుప్త నిధుల కోసం తవ్వకాలు.. రాళ్ల మధ్య ఉన్న విగ్రహాలు ధ్వంసం..!

గుప్త నిధుల కోసం తవ్వకాలు.. రాళ్ల మధ్య ఉన్న విగ్రహాలు ధ్వంసం..!

కొండమల్లేపల్లి, మనసాక్షి :

నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లి మండలంలోని చింత చెట్టు తండా గ్రామపంచాయతీ ధ్వంసమైన బండ రాళ్లు జేత్యతండాలో గుప్త నిధుల కోసం భారీగా తవ్వకాలు జరిగినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది.

తండావాసులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా …ఇన్చార్జి ఎస్ఐ అజ్మీరా రమేష్ కు తెలిపిన వివరాల ప్రకారం.. జేత్యతండా పరిధిలో గల సర్వే నెం.19లో సుమారు 110ఎకరాల పట్టా భూములు ఉన్నాయి.

అందులో సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ రియలేస్టేట్ వ్యాపారి సుమారుగా 16ఎకరాలు తండాకు చెందిన ముగ్గురు, నలు గురు నుంచి కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో గల వీరన్న గుట్టలో వెలిసిన వీరన్న, మల్లన్న, ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి.

చుట్టుపక్కల గల చింతచెట్టుతండా, జేత్యతండా, పూల్సింగ్ తండాకు చెందిన గిరిజనులు సుమారు 40 ఏళ్లుగా తమ ఆచారాలకు అనుగుణంగా పండగలకు తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు అక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు.

ఆ భూమిని కొనుగోలు చేసిన రియల్ వ్యాపారి గుట్ట చుట్టు ఫ్రీ కాస్ట్లో ప్రహరీ గోడతో పాటు ఓ గేటు ఏర్పాటు చేసి తండావాసులు లోనికి వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. దాదాపు 3నుంచి 4నెలల నుంచి ఎక్సకవేటర్ల సాయంతో రాత్రి వేళలో ఎవరికీ అను మానం రాకుండా గుట్టను దాదాపుగా 30 అడుగుల వెడల్పు, 50అడుగుల లోతు మేర తవ్వకాలు జరిపారు.

గుప్త నిధుల కోసం తవ్విన గుంతను అనుమానం రాకుండా పెద్ద ఎత్తున సొరంగం తవ్వినట్లు తండావాసులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం దసరా పండుగను పురస్కరించుకొని ఆయా తండా వాసులు పూజల కోసం అక్కడికి వెళ్లగా గేటుకు తాళం ఉండడంతో గోడపైకి ఎక్కి చూశారు.

దేవుడి విగ్రహాలు పగిలి ఉండడంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిం చగా రానివ్వలేదని తెలిపారు. మూకుమ్మడిగా కలిసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద గుంతలు, బొయ్యారం కనిపించడంతో గుంతలు ఎందుకు తవ్వారని రియల్ వ్యాపారిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో మంగళవారం సదరు రియల్ వ్యాపారిని నిలదీశారు.

గుడి కట్టిస్తానని. దాటవేత సమాధానాలు చెబుతున్నట్లు తండావాసులు చెబుతున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తండావాసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు