మతిస్థిమితం లేని వ్యక్తి కుటుంబ సభ్యుల వద్దకు 

మతిస్థిమితం లేని వ్యక్తి కుటుంబ సభ్యుల వద్దకు 

మహేశ్వరం, మన సాక్షి:

మతిస్థిమితం లేక తప్పిపోయిన వ్యక్తిని వైద్యాన్ని అందించి మూడు సంవత్సరాల తరువాత కుటుంబసభ్యుల చెంతకు మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఫౌండర్ గట్టు గిరి చేర్చారు. గత మూడు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కర్నూల్ జిల్లా,వేలుగోడ్ మండలం రేగాడిగుడురు గ్రామానికి చెందిన వడ్డే సురేష్ బాబు వయస్సు 35 సం,,లు మతిస్థిమితం సరిగ్గా లేక ఇంటినుండి తప్పిపోవడం జరిగింది.

 

అప్పటి నుండి అతని ఆచూకి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు.గత జనవరి నెలలో హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బాండ్ ప్రాంతంలో స్పృహ లేకుండా గాయాలతో పడివున్న వడ్డే సురేష్ గురించి స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకొని అతనిని చేరదీసి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది.

 

అతనికి వసతి, పౌష్టికాహారం,మానసిక వైద్యాన్ని అందించి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అతని గురించి ఆశ్రమ ఫౌండర్ గట్టు గిరి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది.ఆ పోస్ట్ చూసినటువంటి వడ్డే సురేష్ అన్నయ్య వడ్డే స్వామి మద్దిలేటి అతనిని గుర్తుపట్టి ఆశ్రమ ఫౌండర్ గట్టు గిరికి ఫోన్ చేసి తన తమ్ముడి గురించి వివరాలు తెలుసుకోవడం జరిగింది.

 

వారి అన్నయ్య  వడ్డే స్వామి మద్దిలేటి మంగళవారం నాడు నాదర్గుల్ లోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి చేరుకొని తన తమ్ముడిని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.ఆయన మాట్లాడుతూ మళ్ళి తన తమ్ముడిని చూస్తామనుకోలేదని అనేక చోట్ల ఎంత వెతికినా ఫలితం దొరకలేదని చివరకు చనిపోయాడు.

 

అనుకోని వదిలేసుకున్నామని మా తమ్ముడి ని మాకు క్షేమంగా అప్పజేప్తున్న మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఫౌండర్ గట్టు గిరికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గట్టు గిరి వడ్డే సురేష్ ను వారి అన్నయ్య వడ్డే స్వామి మద్దిలేటి కి ఆదిబట్ల ఎఎస్సై సి.నరసింహ సమక్షంలో అప్పజెప్పారు.