Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Ande sri : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..!

Ande sri : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..!

మన సాక్షి, హైదరాబాద్ :

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గేయం రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. సోమవారం ఉదయం లాలాపేటలోని ఆయన  ఇంట్లో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందారు. ఉదయం 7:25కి అందెశ్రీ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటన చేశారు. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య,
1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో ఆయన జననం. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.
అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట.

జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వం అందెశ్రీ కి ఇటీవల రూ.కోటి పురస్కారం అందించింది.

2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం లభించింది.

2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్.

2015లో దాశరథి సాహితీ పురస్కారం.

2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం.

2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం.

2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం.

లోక్‌ నాయక్‌ పురస్కారం.

MOST READ : 

  1. Alumni : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. 17 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..!

  2. VISA : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాక్.. యూఎస్ వీసా మరింత కఠినం..!

  3. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  4. NARAYANPET : రెజ్లింగ్ లో రాష్ట్ర స్థాయి పోటీలకు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎంపిక..! 

మరిన్ని వార్తలు