Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : అంగరంగ వైభవంగా అభ్యాస్ లో ఫేర్వల్ డే వేడుకలు..!

Miryalaguda : అంగరంగ వైభవంగా అభ్యాస్ లో ఫేర్వల్ డే వేడుకలు..!

విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత విద్యను అభ్యసించి మంచి మార్గంలో ముందుకు నడవాలని – ఎమ్మెల్యే బి ఎల్ ఆర్

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అభ్యాస్ టెక్నో విద్యాసంస్థల 9వ, 10 తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే పట్టణంలోని టిఎన్ఆర్ గార్డెన్స్ లో చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి-పుష్పాలత లు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు మాట్లాడుకుని ఆప్యాయతగా పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి పుష్పలత, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా బిఎల్ఆర్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత విద్యను అభ్యసించి మంచి మార్గంలో ముందుకు నడవాలని, పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి ఉన్నత విద్య ను అభ్యసించి పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు.

పాఠశాల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… 2008లో 140 మంది విద్యార్థులతో ప్రారంభమై నేడు 1500 మంది విద్యార్థుల సంఖ్యను కలిగి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దామన్నారు. విద్యార్థులు మా పాఠశాలలో క్రమశిక్షణతో పాటు కల్చరల్ ఆక్టివిటీతో పాటు అన్ని రంగాలలో ముందుంటారని, విద్యాసంస్థ స్థాపించినప్పటి నుండి నేటి వరకు విద్యార్థులు ఉత్తీర్ణతలో ముందుంటున్నారని అన్నారు.

లాగే జిల్లా స్థాయిలో మా సంస్థకు మంచి పేరును తెచ్చి పెడుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. చదువే అన్నిటికంటే విలువైనదని, ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరారు. విద్యార్థులు ఇప్పటివరకు వివిధ దేశాలలో సాఫ్ట్వేర్లుగ, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని వారి లాగానే ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థానాలోకి వారన్నారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎం పి టిసి బెజ్జం సాయి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండు, ఫ్లోర్ ఇన్చార్జి లు సలాకర్, నరసింహారెడ్డి, నాగ లక్మి, ఉపాధ్యాయులు ఉపాధ్యాయనీలు విద్యార్థుల తల్లిదండ్రులు, డ్యాన్స్ మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  5. Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!

మరిన్ని వార్తలు