దుబ్బాక : అప్పులు తీర్చలేక ఉరివేసుకొని రైతు ఆత్మహత్య

అప్పులు తీర్చలేక ఉరివేసుకొని రైతు ఆత్మహత్య

దుబ్బాక, మనసాక్షి :
చేసిన అప్పులు తీర్చలేక… వేసిన మూడు బోర్లలో సుక్క నీరు పడకపోవడంతో ఓ రైతు తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు చీరతో ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం సాయంత్రం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో చోటుచేసుకుంది.

 

దుబ్బాక ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్లాపూర్ రెండో వార్డు చెందిన కంకణాల లక్ష్మయ్య (67) అనే రైతు తనకున్న వ్యవసాయ పొలంలో మూడు బోర్లు వేశాడు.

 

వేసిన మూడు బోర్లలో చుక్క నీరు పడకపోవడంతో, బోర్లు వేయడానికి తీసుకువచ్చిన అప్పు ఎలా తీర్చాలో తెలియక తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

మృతిని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కి పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు ఎస్సై తెలిపారు.