తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Nelakondapalli : తెల్లవారుజామున ఉలిక్కిపడ్డ రైతులు, కల్వర్టుపై గుంత.. లోపల చూస్తే షాక్..!

Nelakondapalli : తెల్లవారుజామున ఉలిక్కిపడ్డ రైతులు, కల్వర్టుపై గుంత.. లోపల చూస్తే షాక్..!

నేలకొండపల్లి, మన సాక్షి :

తెల్లవారు జామున రైతులు పొలాల వైపు వెళ్లేందుకు కల్వర్టు దాటుతుండుగా ఒకసారిగా కల్వర్టు ఊగింది. దీంతో రైతులు ఉలిక్కిపడ్డారు. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని మంగాపురంతండా లో సోమవారం ఉదయం కల్వర్టు ను అనుకుని పెద్ద గుంట పడింది.

గ్రామానికి చెందిన తేజావత్ వైకుంఠం, భూక్యా సీత్యా, భూక్యా గోబ్రియా, తేజ్, నాగేశ్వరరావు అనే రైతులు ఉదయం పొలాల వైపు వెళ్తున్నారు. మంగాపురం మేజర్ పై ఉన్న కల్వర్టు ను దాటుతుండుగా కల్వర్టు ఒక్కసారిగా ఊగటంతో పక్కన పెద్ద గుంట పడింది. ఈ హఠాతుపరిణామంతో రైతులు ఉలిక్కిపడ్డారు.

దాదాపు నాలుగు అడుగుల లోతు లో పెద్ద గుంట పడింది. రైతులు చాకచాక్యంగాతప్పించుకోవటంతో ప్రమాదం తప్పింది…. లేకుంటే గుంటలో పడే అవకాశం ఉంది. రైతులు గుంతను పరిశీలించగా పాములు కనిపించాయి.

కల్వర్టు వద్ద జరగటంతో రైతులు ఆందోళన చెందారు. కాగా కల్వర్టు నిర్మించి చాలా ఏళ్లు కావటంతో శిధిలావస్థకు చేరి ఇలా జరిగిందా అని రైతులు చర్చించకుంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేయాలని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు