పూరిల్లు పూర్తిస్థాయిలో దగ్ధం..!

చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ పరిధిలోని రజిపెళ్లి కాలనీ గ్రామంలో ఓ పూరింట్లో కరెంట్ షార్ట్ అయ్యి మంటలు రావడంతో శనివారం ఆ ఇల్లు పూర్తిస్థాయిలో దగ్ధం కావడం జరిగింది.

పూరిల్లు పూర్తిస్థాయిలో దగ్ధం..!

ఆదుకోండి అంటూ.. బాధితులు ఎదురుచూపులు

చర్ల, మన సాక్షి:

చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ పరిధిలోని రజిపెళ్లి కాలనీ గ్రామంలో ఓ పూరింట్లో కరెంట్ షార్ట్ అయ్యి మంటలు రావడంతో శనివారం ఆ ఇల్లు పూర్తిస్థాయిలో దగ్ధం కావడం జరిగింది.

ఆ ఇంటి సంబంధికులు బుటారి జోగయ్య, నాన్నేమ్మలు మాట్లాడుతూ ఆరుగాలం  కష్టించి పండించిన (పత్తి) పంటను అమ్మి అప్పులు కట్టుకోవడం కోసం పండించిన పంటను మొత్తం ఇంట్లోకీ చేర్చామని అలాంటి సమయంలో శనివారం మా ఇంట్లో కరెంటు షార్ట్ అయ్యి పంట మొత్తం అగ్ని పాలు అయిందని వారు ఆవేదన వెల్లబుచ్చారు.

ALSO READ : Election : ఎల్లారెడ్డి బాద్ షా అతనే..!

పత్తి పంట సుమారుగా మూడు, నాలుగు, క్విoటాలు వరకూ ఉంటుందని వారు తెలిపారు. అంతేకాకుండా వరి ధాన్యం మూడు,నాలుగు, క్వింటాలు వరకు ఇంట్లోనే ఉండి పోయాయని, తులం బంగారం కూడా ఇంట్లోనే ఉందని, కనీసం వంట పాత్రలు కూడా మిగలలేదని తెలిపారు.

కట్టుకోవడానికి ఒక్క బట్ట కూడా తియ్యడానికీ అనుకూలం లేకుండా పూర్తిస్థాయిలో కాలిపోయాయని,మండుటెండలో కష్టం చేసుకుని సంపాదించుకున్న సంపాదన మొత్తం అగ్నిపాలై రోడ్డున పడ్డామని వారు అన్నారు. మాకు జరిగిన ఈ నష్టాన్ని మా పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకొని మమ్ములను ఆదుకోవాలని ఆ కుటుంబీకులు వేడుకుంటున్నారు.

ALSO READ : ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ ను కంగారు పెట్టిస్తున్నాయా..!