Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Election : ఎల్లారెడ్డి బాద్ షా అతనే..!

ఎల్లారెడ్డి బాద్ షా అతనే..!

నాగిడిపేట్, మన సాక్షి:

ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుందోనన్న ఉత్కంఠ కు నేడు తెరపడనుంది. బీఆర్ఎస్ పార్టీ తరపున జాజాల సురేందర్, కాంగ్రెస్ పార్టీ తరపున మదన్ మోహన్, భారతీయ జనతా పార్టీ తరపున వడ్డేపల్లి సుభాష్ రెడ్డిలు ఎన్నికల బరిలో నిలిచారు.

ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఈ ఎన్నిక టఫ్ ఫైట్ సాగింది. మెజార్టీ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఎవరి వైపు ఉందో నన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. పోలింగ్ జరిగిన గురువారం రోజు నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి పట్టణం తోపాటు, నియోజకవర్గంలోని ఆయా మండలాల, గ్రామాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బిఆర్ఎస్ పార్టీల అభ్యర్థి జజల సురేందర్ కు సైతం నియోజకవర్గంలో భారీగానే ఓట్లు పోలైనట్టు తెలుస్తుంది.

ALSO READ : ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ ను కంగారు పెట్టిస్తున్నాయా..!

ఎవరి ధీమా వారిది : 

బిఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ఫుల్ సంతోషంగా కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన కష్టానికి ఫలితం దక్కుతున్నట్లు ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళీని బట్టి, ఆయా ప్రధాన పార్టీల నేతలు లెక్కలు వేసుకుని మరి గెలుపు ధీమాను ఎవరికివారుగా వ్యక్తం చేస్తున్నారు.

సైలెంట్ ఓటింగ్ ఎటువైపు…?

నిన్నటీ వరకు ఫలానా అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పిన ఓటర్లు, సైలెంట్ గా తమ ఓటు హక్కు ను వినియోగించుకోవడంతో ఈ సైలెంట్ ఓటు ఏ అభ్యర్థికి అనుకూలం అవుతుందో నాని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  వారు ఎటువైపు ఓటు వేస్తారోన్నదాని పైనే నేతల్లో టెన్షన్ నెలకొంది. ప్రధాన పార్టీల నేతలు ఎవరొచ్చి అడిగినా మా ఓట్లు మీకే వేషామంటూ నమ్మ బలుకుతుండడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

ALSO READ : Political News : తెలంగాణ ఆ పార్టీకి పేటెంటా.. పార్టీ పేరులోనే తెలంగాణ పదం తొలగించిన వారికా, మరి ఎవరికి..!

అయితే కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్న వారితోపాటు,యూత్, వివిధ కుల సంఘాల వారు ఈ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో తెలవని పరిస్థితి దాపురించింది. ఒక ప్రక్క ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నవారు, ప్రభుత్వ మార్పు కోరేవారు మాత్రం, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారుల తో పాటు, మరి కొంతమంది మాత్రం బీఆర్ఎస్ పార్టీకే జై కొట్టారండటంలో సందేహం లేదు.

ఏది ఏమైనా కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు, టిఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్ల మధ్యన హోరాహోరీ గా జరిగిన ఎన్నికల పోటీల్లో ఏ అభ్యర్థి విజయ కేతనం ఎగురవేయనున్నారో నేడు తేలిపోనుంది.

ALSO READ : Viral : రేవంత్ రెడ్డి పూజల ఫోటోలు, కామెంట్ సోషల్ మీడియాలో వైరల్..!

మరిన్ని వార్తలు