ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ ను కంగారు పెట్టిస్తున్నాయా..!

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్, దాదాపుగా అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ వైపు చూపిస్తున్నాయి. దాంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన పడుతున్న విషయం తెలిసిందే. దాంతో మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ ను కంగారు పెట్టిస్తున్నాయా..!

ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడద్దని చెప్పిన కేటీఆర్

తప్పు అని తేలితే మీడియా సంస్థలు క్షమాపణ చెబుతాయా.. కేటీఆర్

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్, దాదాపుగా అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ వైపు చూపిస్తున్నాయి. దాంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన పడుతున్న విషయం తెలిసిందే. దాంతో మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కంగారు పడవలసిన అవసరం లేదన్నారు. తిరిగి 3వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తారని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ అధికారం బీఆర్ఎస్ పార్టీ దేనిని తెలిపారు.

ALSO READ : మిర్యాలగూడ : ఇద్దరి మధ్య బిగ్ ఫైట్.. గెలిచేది అతడేనా..!

ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ ను గతంలో కూడా చూసామని, ఎగ్జిట్ పోల్స్ తప్పు అని నిరూపించడం మాకు కొత్తేమి కాదన్నారు. డిసెంబర్ మూడో తేదీన 70కి పైగా స్థానాలతో విజయం సాధిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను చూసి కంగారు పడాల్సిన అవసరం అవసరం లేదని తెలిపారు.

కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా.. 200 మందిని అడిగినట్లు గొప్పగా చేసి చూపిస్తున్నారని అన్నారు. గతంలో ఐదు మీడియా సంస్థలు సర్వేలు చేస్తే ఒక మీడియా సంస్థ సర్వేనే నిజమైందని తేలినట్టు ఆయన తెలిపారు.

ALSO READ : ఆ నియోజకవర్గాల్లో అప్పుడే ముగిసిన పోలింగ్

ప్రజలు ఇంకా క్యూలో నిల్చని ఓట్లు వేస్తున్నారని, అప్పుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం ఏంటని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అసలు ఏ లాజిక్ తో ఎగ్జిట్ పోల్ ఇస్తున్నారో అర్థం కావటం లేదని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అన్నారు. ఒకవేళ డిసెంబర్ మూడో తేదీన ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా అని ఎగ్జిట్ పోల్స్ ప్రచురించిన మీడియా సంస్థలను ప్రశ్నించారు.

ఎవరు కన్ఫ్యూజ్ కావద్దని వందకు వంద శాతం అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. గత 9 రోజులుగా కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా గంటన్నరసేపు పోలింగ్ జరిగేది ఉందని 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ : Viral : రేవంత్ రెడ్డి పూజల ఫోటోలు, కామెంట్ సోషల్ మీడియాలో వైరల్..!

కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు. ఇంకా పోలింగ్ శాతం తేలలేదని, ఫైనల్ పోలింగ్ ఎంత జరిగిందనేది రేపు ఉదయం తేలుతుందని తెలిపారు.