ఆ నియోజకవర్గాల్లో అప్పుడే ముగిసిన పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది.

ఆ నియోజకవర్గాల్లో అప్పుడే ముగిసిన పోలింగ్

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. చెన్నూరు, బెల్లంపల్లి ,సిర్పూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి ,ములుగు, పినపాక , ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ నాలుగు గంటలకు ముగిసింది

ALSO READ : Viral : రేవంత్ రెడ్డి పూజల ఫోటోలు, కామెంట్ సోషల్ మీడియాలో వైరల్..!

రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఉదయం ఏడు గంటలకు అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. కాగా అన్ని నియోజకవర్గాలలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతున్నది. కాగా సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ అధికారులు అనుమతించారు.

ALSO READ : మిర్యాలగూడ : ఇద్దరి మధ్య బిగ్ ఫైట్.. గెలిచేది అతడేనా..!

.దాంతో ఆ 13 నియోజకవర్గాలలో పోలింగ్ ముగిసింది. మిగతా నియోజకవర్గాలలో పోలింగ్ కొనసాగుతుంది. మూడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా రాష్ట్రంలో మెదక్ లో 69.33% పోలింగ్ నమోదు కాగా హైదరాబాదులో అతి తక్కువ 31.17% మాత్రమే పోలింగ్ నమోదయింది.