నల్గొండ : దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు – జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు – జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

మాడ్గులపల్లి, మనసాక్షి:
వానాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అమ్మాలి అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మాడుగులపల్లి లో ఉన్న రైతుసేవా ఆగ్రో కెమికల్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

 

రైతులు దళారుల మాటలు నమ్మి అనుమతులు లేని డీలర్ల దగ్గర విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు. మండల వ్యవసాయ అధికారి తరుచు మండలం లో ఉన్న ఎరువుల దుకాణాలు తనిఖీ చేసి అనుమతులు లేని షాపులను రద్దు చేయాలని అన్నారు.అదే విధంగా కుక్కడం లోని నర్సరీ ని పరిశీలించి ..మొక్కల పెంపకం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.

 

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్గుబెల్లి గోవింద రెడ్డి, ఎంపీడీఓ దండ జితేందర్ రెడ్డి, ఎంపీ ఓ రవి కుమార్ తదితరులు ఉన్నారు.