మిర్యాలగూడ : రైతులను ఓదార్చిన కాంగ్రెస్ నేత ముదిరెడ్డి
మిర్యాలగూడ : రైతులను ఓదార్చిన కాంగ్రెస్ నేత ముదిరెడ్డి
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోనే అవంతిపురం మార్కెట్ యార్డ్ లో ధాన్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వర్షాలకు వరి కుప్పలు మొత్తం కూడా తడిసి మొలకలుత్తాయని, నెల రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసిన ఎంతవరకు కాంటాలు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చెందారు. ఈ సందర్భంగా రైతులను ఓదార్చిన కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. తడిసిన ప్రతి గింజలు కూడా కాంటావేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇలాగే రైతుల పట్ల మొండి వైఖరి చెబితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తలకొప్పుల సైదులు, పోలగోని వెంకటేష్ గౌడ్, మండల మైనార్టీ అధ్యక్షులు మహమూద్ గౌస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇమ్రాన్, శ్రీనివాస్, రవి, రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.









