Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

Telangana Formers: ఎకరానికి రూ.10 వేలు, తెలంగాణలో ఆ.. రైతులకు మాత్రమే..!

Telangana Formers: ఎకరానికి రూ.10 వేలు, తెలంగాణలో ఆ.. రైతులకు మాత్రమే..!

మనసాక్షి , హైదరాబాద్ :

తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించడంతో పాటు పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు . ఆ సందర్భంగా రైతులను ఆదుకునేందుకు ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

 

ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకునేందుకు ఎకరానికి 10000 రూపాయల చొప్పున అందజేయడానికి అధికార యంత్రంగాన్ని సిద్ధం చేశారు. దాంతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

 

అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను గత నెల 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, వరంగల్ జిల్లాలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను కూడా పరిశీలించిన విషయం తెలిసిందే.

 

పంటలు నష్టపోయిన వివరాలను వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించి సేకరించారు. ఆ సర్వే ఆధారంగా పంట నష్ట నష్టపరిహారంగా రైతులకు ప్రభుత్వం చెక్కులు అందజేయాలని నిర్ణయించారు.

 

పంటలు నష్టపోయిన రైతుల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించిన అధికారులు ఈనెల 12వ తేదీ నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనున్నారు. పంటలు నష్టపోయిన రైతులతో పాటు, కౌలు రైతులను కూడా గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి రైతులకు పంట నష్టపరిహారం అందే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు